about
about

శ్రీ అభయాంజనేయ స్వామివారి 100 అడుగుల విగ్రహం మరియు దేవాలయం, పర్చూరు.

100 feet statue & temple of Sri Abhayanjaneya Swamy, Parchur.

Parchuru town is located in Prakasam district (on the border of Guntur district), Andhra Pradesh and has a wonderful Y-Junction leading to nearby Guntur, Chirala and Chilakaluri Peta towns.

A new 100 feet tall Sri Abhaya Anjaneya Vigraham is being constructed at the Parchuru Y-Junction by the Hanuman devotees from Parchuru town and the surrounding villages. Although the work was initiated back in 2020, due to covid hurdles the real work has just commenced from November, 2021. Hundreds of volunteers/construction workers have been enthusiastically working day and night on this devotional cause!

The overall projected cost estimate (from the beginning to the end) could be around 3 to 4 crores of rupees and the fully completed statue would likely be ready by the early 2023. The fund-raising initiative has already started.. kindly donate and be a part of this great statue project!!

ప్రకాశం/గుంటూరు జిల్లాల బోర్డర్‌లో ఉన్న పర్చూరు పట్టణంలో ఉన్న Y-జంక్షన్ (గుంటూరు/చీరాల/చిలకలూరిపేట పట్టణాలకు వెళ్ళే రహదారుల కూడలి) దగ్గర ప్రకాశం/గుంటూరు జిల్లాలలోనే అతి పెద్ద హనుమాన్ విగ్రహ నిర్మాణానికి సర్వ సన్నాహాలు మొదలయ్యాయి. పర్చూరు పట్టణం మరియు పరిసర గ్రామాలలోని హనుమాన్ భక్తులందరూ ఈ 100 అడుగుల శ్రీ అభయ ఆంజనేయ విగ్రహ నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు.

విగ్రహానికి స్థల సేకరణ, శంకు స్థాపన గత సంవత్సరంలోనే (2020) జరిగినప్పటికీ, కోవిడ్ అడ్డంకుల కారణంగా నిర్మాణపు పనులు మాత్రం ఇటీవలే (నవంబర్, 2021) మొదలయ్యాయి. వందలాది వాలంటీర్లు/కార్మికులు రేయింబవళ్ళు పనిచేస్తున్నారు. కృష్ణాజిల్లాలోని 135 అడుగుల పరిటాల హనుమాన్ విగ్రహాన్ని రూపొందించిన శిల్పిగారి పర్యవేక్షణలో ఈ పర్చూరు విగ్రహ నిర్మాణపు పనులు చురుగ్గా, వేగవంతంగా జగుతున్నాయి.

సంపూర్ణ విగ్రహ నిర్మాణానికి దాదాపుగా 3,4 కోట్ల రూపాయల వ్యయం కాగలదని అంచనా.. మార్చి 2023 లోపుగా విగ్రహ నిర్మాణం పూర్తి కానున్నది. ఈ భగవత్కార్యానికి దాతలందరూ తమ ఉదార విరాళాలతో విగ్రహ నిర్మాణంలో భాగస్వాములు కావలసిందిగా మా విన్నపం!!

జై శ్రీరామ్! జై హనుమాన్!!

అభయ ఆంజనేయస్వామి నమోస్తుతే...

జై శ్రీరామ్ నామస్మరణ బలంతో దాదాపుగా 100 అడుగుల అభయాంజనేయ శిలాభోగమై ప్రకాశించబోతున్నారు పర్చూరు గ్రామంలో...

శ్రీరామచంద్రమూర్తి ఆజ్ఞతో కొలువుదీరాల్చిన హనుమంతుడు… చిమట శ్రీనివాస్ చిరునవ్వు చలువై.., రామకార్యం కనుక రామదండులా వెల్లువెత్తిన  పర్చూరు మరియు చుట్టుపక్కల పల్లెల విరాళాలతో  సాక్షాత్స్వా మియే వచ్చి సుమారు వంద అడుగుల పరిధిలో ఇలా భక్తకోటికి దర్శనమిస్తూ  జై శ్రీరామ్ నామస్మరణ బలంతో దాదాపుగా 100 అడుగుల అభయాంజనేయ శిలాభోగమై ప్రకాశించబోతున్నారు..

శ్రీ చిమట శ్రీనివాసరావు గారితో
కోటా శ్రీనివాసరావు.

Ge In Touch