About Statue & Donors

అభయ ఆంజనేయస్వామి నమోస్తుతే…

“యత్ర యత్ర రఘునాథ కీర్తనం- తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్, బాష్పవారి పరిపూర్ణలోచనం – మారుతిం నమత రాక్షసాంతకమ్’” అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు.

హనుమంతుడు చిరంజీవిగా అనుగ్రహం పొందిన దేవుడు. ఎక్కడ శ్రీరామ కీర్తనలు వినిపిస్తే అక్కడ ఉంటాడు.

హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి లేదా విగ్రహం లేని ఊరు అరుదు.

శ్రీ ఆంజనేయం  – మహావీరం  – బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోదాత్తం – శ్రీ రామ దూతం శిరసా నమామి…

శ్రీ రామచంద్రమూర్తి కరుణతో… అభయ ఆంజనేయస్వామి అనుగ్రహంతో పర్చూరు నియోజకవర్గంల్లోని పర్చూరు గ్రామం భవిష్యత్త్ స్థలాభోగం కానున్నది…

పర్చూరు

అటు పల్నాడు, ప్రకాశం..ఇటు గుంటూరు బాపట్ల కు మధ్యలో సముద్రతీరానికి 20 కిలోమీటర్ల దూరంలో కొలువైనాడు మన అభయ ఆంజనేయస్వామి… పర్చూరు , గ్రామం, మండల కేంద్రం.ఇది సమీప పట్టణమైన చీరాల … బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్.

జై శ్రీరామ్ నామస్మరణ బలంతో దాదాపుగా 100 అడుగుల అభయాంజనేయ శిలాభోగమై ప్రకాశించబోతున్నారు..

సంకల్పం సంస్కారం గట్టిదైనప్పుడు… సంజీవని పర్వతం మోసుకొచ్చిన సౌశీల్యుడు హనుమ కూడా పర్చూరు ప్రాంతమందు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నటరాజ  శ్రీనివాస్ మరియు పర్చూరు ప్రజల గుండెల్లో అణువుగా ఆవిర్భవించి చిమట శ్రీనివాస్ గారి ఎముకలేని చెయ్యి ఫలమై సుమారు 100 అడుగుల అభయ ఆంజనేయస్వామి అందరికీ అభయమిస్తున్నాడు…

ఆనాడే పావనసుతుడు హనుమంతుడు నిర్ణయించాడు… పర్చూరు లో నా అభయం ఎత్తు ఆకాశమని..,నా స్వరూపం ఎత్తు 100 అడుగులని నిర్ణయించాడు చిరంజీవి మారుతిరాయుడు అతిబలవంతుడు…

కొంతకాలానికే వానర స్వరూపమొకటి హస్తమించి భవిష్యత్తులో జరగాల్సిన శుభకార్యానికి పునాదిగా  నటరాజ శ్రీనివాసుడే అందుకు ఆది బిందువుగా… చిమట శ్రీనివాసరావులే ఓ భృహత్ కార్యానికి బ్రహ్మతేజస్సుగా శ్రీరామచంద్రమూర్తి అభయమిచ్చి ఉన్నాడు…

ఆ ధర్మమూర్తి శ్రీ రామచంద్ర ప్రభు అభయంలో అంతర్భాగమే… ఓ కోతి హనుమంతుడి ప్రతిరూపంగా పర్చూరు నేలలోకి ప్రాణత్యాగంతో శ్రీ రామచంద్రమూర్తి జపంతో ప్రవేశించి ఈ ప్రాంతం పవిత్రతను పవనసుతుడు ఆభయ ఆంజనేయస్వామి నిలబడేలా శుద్ధము చేసింది…

శ్రీరామచంద్రమూర్తి ఆజ్ఞతో కొలువుదీరాల్చిన  హనుమంతుడు… చిమట శ్రీనివాస్ చిరునవ్వు చలువై.., రామకార్యం కనుక రామదండులా వెల్లువెత్తిన  పర్చూరు మరియు చుట్టుపక్కల పల్లెల విరాళాలతో ఇలా వివిధ దేశాలు, వివిధ రాష్టాలు ప్రజలు ఫలమై సాక్షాత్ స్వామియే వచ్చి సుమారు వంద అడుగుల పరిధిలో ఇలా భక్తకోటికి దర్శనమిస్తూ నిలబడ్డాను మన అభయ ఆంజనేయస్వామి…

నాలుగు జిల్లాల సరిహద్దు సంధ్యలని..,భక్తకోటిని.., అనుగ్రహించిన ఆనందం హృదయవసంత సోయగం అటు పల్నాడు ప్రకాశం..ఇటు గుంటూరు బాపట్ల కు మధ్యలో సముద్రతీరానికి 20 కిలోమీటర్ల దూరంలో కొలువైనాడు మన అభయ ఆంజనేయస్వామి

చిమట శ్రీనివాస్ ఆశయ చిరునవ్వు చిరస్మణీయమై

వారి తల్లిదండ్రులు చిమట క్రిష్ణయ్య  చిమట అచ్చమ్మ దంపతుల భక్తి ఫలమై…

విశిష్ట ఘన చరిత్రలో

 చిమట శ్రీనివాస్ గారు… ఆర్థికపరమైన కన్నుగా… కోటి 50 లక్షలు

నటరాజ శ్రీనివాస్ గుండె చప్పుడు కలై …

లగడపాటి శంకర్ గారు మొట్టమొదటగా 5 లక్షలు

కోట శ్రీనివాసరావు గారు స్థల సేకరణకు సాయపడడం….

25,00,000 లక్షలు… మండపానికి షెడ్ ఆళ్ళ అనీల్ గారు వేయించడం.

నర్రా వెంకట్ లక్ష్మీ సుధాగారు 9,00,000 లక్షలు

ఎడం బాలాజీ గారు 8,00,000 లక్షలు…ఇవ్వడం..

ఏలూరు సాంబశివరావు గారు 5,56,789 లక్షలు

ఆమంచి కృష్ణమోహన్ గారు 500000 లక్షలు

వాడపల్లి కాళేశ్వరావు గారు 5,00,000 లక్షలు

ఇలా వివిధ దేశాలు, వివిధ రాష్టాలు, వివిధ పల్లెలు మరియు పర్చూరు ప్రజలు ఫలమై ఇంతింతై వటుడింతై 95 అడుగుల ఎత్తులో నిలబడి..,బాపట్లకు,చీరాలకు..,గుంటూరుకు.., ….., రహదారులపై ప్రాణాలు దారితప్పిపోకుండా కాపాడ వచ్చావు…ధన్యోస్మీ అభయ ఆంజనేయస్వామి…

రామదూతలుగారామకార్య బాణాలుగా 

కోట హరిబాబు గారు

అన్నీ తానై సహకరించి ముందుకు నడిపించడం…

కట్టారి సురేంద్ర బాబు గారు

ఉడుతా సాయమై చేయూతనీయడం…

రంగిసెట్టీ ఆంజనేయులు గారు..

సలహాలు సూచనలు ఇవ్వడం…

తులసి శివనాగేశ్వరారావు గారు

ఈ కార్యమును తులసివనంలా తీర్చిదిద్దడం…

గద్దిపాటి శ్రీనివాసరావు గారు

తనవంతు శ్రమను ధారపపోయడం…

లంకా రామలక్ష్మణులు దగ్గరుండి

ఈ ఆధ్యాత్మిక యాగంలో మేము సైతం అని నిస్వార్థ కర్మఫల సేవా చేయడం…

విదేశీ తీరాలలో స్థిరపడ్డ పర్చూరు వాసులు..

వివిధ రాష్ట్రాల్లో నివాసమైన పర్చూరు వాసులు…

ఇక్కడే నివసిస్తున్న పర్చూరు ప్రజలు…

చుట్టు ప్రక్కల పల్లెలు పట్టణాలు…

అంతా ఏకమై 95 అడుగుల అభయ ఆంజనేయస్వామి అనుగ్రహించి పర్చూరి నడిబొడ్డున నెలకొనడానికి తమ వంతు విరాళం ఇచ్చిన విశేషమై.., ప్రతీ హృదయం చేసిన కృషి ఋషిగుణమునకు తలమానికం…

భవిష్యత్ బాటలో

అందరికీ ఆరాధ్య దైవమై…

ప్రతీ హృదయానికి పర్చూరి అభయ ఆంజనేయస్వామి ధర్మార్ధ కామ మోక్ష ఫలం ప్రసాదించడం ఖచ్చితం…

విదేశీ తీరాలలో స్థిరపడ్డ చిమట  శ్రీనివాసరావు గారి శ్రేయోభిలాషులు మరియు బంధుమిత్రులు మేము సైతం అంటూ శ్రీనివాసరావు గారి కలని వారు కూడా శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహానికి విరాళాల రూపంలో…

 • ఉదయ భాష్కర్ కొట్టె       2 లక్షలు
 • రామకృష్ణ బుడుగు           2 లక్షలు
 • శ్రీనివాస్ చందు               2 లక్షలు
 • సురేష్ మంత్రాల              2 లక్షలు
 • శ్రీకాంత్ గణిపిశెట్టి            1.5 లక్షలు
 • ఈశ్వర్ అరిగే                  1 లక్ష
 • JV సుబ్రమణ్యం జిడుగు     1 లక్ష
 • మస్తాన్‌రావు చిమట           1 లక్ష
 • మోద కమ్మమెట్టు               1 లక్ష
 • రఘు ఉపాధ్యాయుల         1 లక్ష
 • రెడ్డయ్య ప్రత్తిపాటి             1 లక్ష
 • సతీష్ పాతుగంటి              1 లక్ష
 • సుబ్రహ్మణ్యం సలది            1 లక్ష
 • శ్యామ్ భైరా                       1 లక్ష
 • వంశీ అన్నంగి                    1 లక్ష
 • వీరబాబు ప్రత్తిపాటి              1 లక్ష
 • వీరస్వామి దడి                   1 లక్ష
 • వెంకట అప్పలపూడి             1 లక్ష
 • వెంకటేశ్వరరావు బొందలపాటి  1 లక్ష…
 • వెంకటేశ్వరరావు ఇమడబత్తిని  1 లక్ష
 • జానకి రామ్ దొండపాటి…          50 వేలు
 • శ్రీధర్ రెడ్డి దగ్గుల                   50 వేలు.

పర్చూరు అభయ ఆంజనేయస్వామి ప్రతిష్టాత్మక ప్రతిష్టాపన జూన్ 3 తేదీ…  చినజీయర్ స్వామి మరియు చిమట శ్రీనివాస్ గారి చేతుల మీదుగా జరుగుతుంది…

జై శ్రీ రామ్…. జై శ్రీ రామ్…. జై శ్రీ రామ్…. జై శ్రీ రామ్…. జై శ్రీ రామ్….

అభయ ఆంజనేయస్వామి నమోస్తుతే…